ENGLISH | TELUGU  
Home  » TV News

నా అకౌంట్ బ్లాక్ అయ్యింది...నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ పెట్టి కొత్త స్టోరీలు అల్లొద్దు

on Apr 30, 2025

 

ప్రవస్తి ఆరాధ్య  తాను పాడుతా తీయగా షోలో ఎదుర్కున్న ఎన్నో ఇష్యుస్ ని బయట పెట్టింది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రోజూ ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అలాగే సునీత, కీరవాణి, చంద్రబోస్ వంటి లెజెండరీ సింగర్స్ మీద కూడా అలిగేషన్స్ చేసిన ప్రవస్తికి వాళ్ళు కూడా ఇన్డైరెక్ట్ గా కౌంటర్లు  ఇస్తున్నారు. అలాగే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. దానికి ప్రవస్తి కూడా ఊరుకోకుండా రికౌంటర్లు ఇస్తోంది. ఇప్పుడు ఇంకో పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "చాలా మంది నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ,  అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ  ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో నేను ఆ దుస్తులు వేసుకోమంటూ నన్ను ఎవరూ బలవంతం చేయలేదు, అది నా ఇష్టం మేరకు వేసుకున్నాను. మన ఇష్టానుసారం వేసుకోవడానికి అలాగే ఎవరైనా మనల్ని ఫోర్స్ చేసి వేసుకునేలా చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఐనా స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకోవడం వలన కలిగే సమస్యల గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు.

నేను చెప్పిన విషయాన్నీ  మార్చేసి సొంత కథలు క్రియేట్ చేయొద్దు" అంటూ ఒక కౌంటర్ పోస్ట్ చేసింది. అలాగే ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా ఒక పోస్ట్ పెట్టింది.. " హాయ్ ..నా అకౌంట్ బ్లాక్ అయ్యి మూడు రోజులు అయ్యింది. "చాకిరీ" అని కామెంట్ చేసిన వీడియోకి కాపీ రైట్ ఇష్యూ వచ్చింది. నేను పోస్టులకు రిప్లై ఇవ్వలేను. నేను బాగున్నాను సేఫ్ గా ఉన్నాను. మీ ఆదరణకు నా కృతఙ్ఞతలు" అని చెప్పింది. అలాగే ప్రవస్తి తనకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారూ వాళ్ళ కామెంట్స్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.